ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్):: వినాయక చవితి పర్వదినం ఈ సందర్భం గా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లా రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. విగ్రహాలు అవసరమైన భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి, ఆవుల పుల్లా రెడ్డి సేవా సమితి వారిని సంప్రదించాలి. రసాయనాలతో తయారుచేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, అందుకే మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన ఆళ్లగడ్డ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.