ఆళ్లగడ్డలో ఉపాధ్యాయ సంఘాల ధర్నా

ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్):: జూలై 23 :: ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం జరిగినది. రాష్ట్ర ఎన్జీవో సంఘం ఉపాధ్యక్షుడు వంగల దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందని, పిఆర్సి, డిఏ, సిపిఎస్ రద్దు మరియు ఇతర ప్రధాన సమస్యలపై, ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం కానందున ఈరోజు ధర్నా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు స్టేట్ సెక్రటరీ బి శ్రీనివాసులు, యు టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఐజయ్య, యుటిఎఫ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ పి ఆర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.