వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చాగలమర్రి యువకుడు వల్లం కొండ సాయి

చాగలమర్రి :: (విభారె న్యూస్):: శుభకార్యాలలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను వృథా కాకుండా, ఆకలితో ఉన్న పేదవారికి పంచే కార్యక్రమానికి చాగలమర్రి గ్రామానికి చెందిన వల్లం కొండ సాయి అనే యువకుడు శ్రీకారం చుట్టాడు. కర్నూల్ జిల్లా చాగలమర్రి మండలం బాపనపల్లె గ్రామంలో నిన్న రామాలయం గుడి ప్రతిష్ట సందర్భంగా అక్కడ మిగిలిపోయిన ఆహార పదార్థాలు సేకరించి వృధా కాకుండా, ఆకలితో అలమటిస్తున్న పేదవారికి పంచడం జరిగింది. ఎక్కడైనా శుభకార్యాలలో ఆహార పదార్థాలు మిగిలిపోతే ఈ క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని, ఆయన కోరారు. ఈ సందర్భంగా వల్లం కొండ సాయికి పలువురు పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లంకొండు సాయి , ఓబులేస్ , చరణ్ పాల్గొన్నారు. 9948340319 , 8639004420.