ఆళ్లగడ్డ మాజీ సర్పంచ్ మంగలి నరసింహులు మృతి

ఆళ్లగడ్డ విభారె న్యూస్ : ఆర్లగడ్డ మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ మంగలి నరసింహులు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ, ప్రొద్దుటూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఆళ్లగడ్డ మేజర్ పంచాయతీలో ఉద్యోగిగా చేసి పదవీ విరమణ చేశారు. అనంతరం ఆళ్లగడ్డ మేజర్ పంచాయతీకి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.2005 నుండి 2010 వరకు ఐదు సంవత్సరాలు పూర్తి కాలం సర్పంచ్ గా పనిచేశారు. మృదుస్వభావి, స్నేహశీలి అయిన మంగలి నరసింహులు మరణం పట్ల ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి, విజయ డైరీ చైర్మన్ ఎస్ వి జగన్ మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంగలి నరసింహులు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.