కదిరి ::( విభారె న్యూస్ ):: రూరల్ అగ్రికల్చరల్ డెవలప్ మెంట్ సొసైటీ 2021వ సంవత్సరం జాతీయ అవార్డుకు ఎంపిక అయినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు బండ్ల మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాయలసీమలోని కర్నూలు చిత్తూరు అనంతపురం కడప జిల్లాలు ఎకో డేంజర్ లిస్ట్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎకౌంట్ డేంజర్ నుంచి ఈ నాలుగు జిల్లాలను కాపాడాలంటే చెరువులను సన్ రక్షించాలని, చెట్లను అధికంగా పెంచాలని, అడవులను సంరక్షించడం ఒక్కటే మార్గమన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా రాడ్స్ సంస్థ జాతీయ అవార్డుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. గతంలో 2018 వ సంవత్సరంలో కూడా రాడ్స్ సంస్థ జాతీయ అవార్డుకు ఎంపిక అయినట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు మరియు విద్యార్థులకు సైన్స్ అవగాహన సదస్సులు నిర్వహించి పర్యావరణ పరిరక్షణ పై వారిలో అవగాహన కల్పించేందుకు రాడ్ సంస్థ కృషి చేసినట్లు ఆయన తెలిపారు.