ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్) :: ఈ ఆర్థిక సంవత్సరంలో పాలసీదారులకు సేవలందించడంలో తొమ్మిది మంది ఏజెంట్లు ఎం ఆర్ డి టి స్థాయికి చేరుకున్నారు.స్థానిక డెవలప్మెంట్ ఆఫీసర్ ధరావత్ దేవా గారి ఆధ్వర్యంలో ఐదుగురు ఏజెంట్లు ఈ ఘనత సాధించారని బ్రాంచ్ మేనేజర్ కె.వి. రామశర్మ తెలిపారు. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో జరిగిన ఏజెంట్ల సమావేశంలో పాలసీదారుల సేవలో అగ్రగాములుగా ఉన్న సుద్దుల రామకృష్ణుడు, (నరసాపురం),గాజులపల్లి శ్రీనివాసులు(బి. నాగిరెడ్డిపల్లి),శ్రీ పల్లె మల్లికార్జున రెడ్డి(ఆళ్లగడ్డ),మీనిగ జయచంద్ర నారాయణ( ఎం. తిమ్మాపురం), నూక ప్రతాపరెడ్డి (మందలూరు) మొదలగు వారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్ ధరావత్ దేవా మాట్లాడుతూ ఏజెంట్లు పాలసీదారులకు సేవలు చేస్తూ,వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఉద్బోధించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఏజెంట్లు పాల్గొన్నారు.ఎస్ ఎమ్ షరీఫ్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.