భూమా కిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆళ్లగడ్డ :: విభారె న్యూస్:: ఆళ్లగడ్డ  నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ భూమా కిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆప్తుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. బిజెపి కార్యకర్తలు, బంధువులు, మిత్రులు భూమా కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాల లోని వృద్ధులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు.