వంతెనపై రాకపోకలు వెంటనే పునరుద్ధరించండి :: గంగుల బిజేంద్ర

ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్) :: ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి ఈ రోజు మధ్యాహ్నం అళ్ళగడ్డ మండల పరిధిలోని నందిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు గ్రామం ముందు ఉన్న వంక లో భారీగా వరద నీరు చేరి, ఆ గ్రామానికి వెళ్లే దారిలోని వంతెన పై నుండి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ ప్రాంతాన్ని సందర్శించిన గంగుల వంతెనకు రెండు వైపులా మట్టిపని త్వరగా పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు.