ఆవుల పుల్లారెడ్డి సేవాసమితిలో కరోనా పరీక్షలు

ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్) :: ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లా రెడ్డి సేవాసమితిలో రేపు అనగా శనివారం ఉదయం 10:30 లకు కరోనా పరీక్షలు నిర్వహించబడును. కనుక ఆళ్లగడ్డ పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా వైద్య అధికారులు కోరుతున్నారు. కరోనా పరీక్ష చేయించుకోదలచిన వారు శనివారం ఉదయం 10:30 లకు ఆవుల పుల్లా రెడ్డి సేవా సమితి ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకోవాలని అధికారులు తెలియజేశారు.