ఆళ్లగడ్డ::( విభారె న్యూస్):: ఈ రోజు రుద్రవరం మండలం, రుద్రవరం లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన వైస్సార్ ఆసరా కార్యక్రమం లో శాసనసభ్యులు శ్రీ గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మహిళల కొరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఆసరా పథకం చెక్ ను మహిళలకు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, అధికారులు, వైస్సార్సీపీ మండల ఇంచార్జి గంగుల మనోహర్ రెడ్డి నాయకులు జాకిర్ హుసేన్, రహెమాన్., నూకల కృష్ణమూర్తి, యువనాయకులు. సింగతాల మహేష్ రెడ్డి, హరినారాయణ, కార్యకర్తలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.