ఆళ్లగడ్డలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు గంగుల

ఆళ్లగడ్డ:: (విభారె  న్యూస్) ::    ఆళ్లగడ్డలో వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బిజేంద్రా రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు చిన్నారులకు పోషకాహారాన్ని అందించారు.మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని  బిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో గంగుల బిజేంద్రా  ఆళ్లగడ్డ నుంచి పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 1,863 కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని గంగుల బిజేంద్రారెడ్డి వెల్లడించారు.