కొత్త సెక్రటేరియట్ లో మందిరం, మసీదు, చర్చిని నిర్మిస్తాం

 కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియట్లో మందిరం,  మసీదు,  చర్చిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెలిపారు. ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాల కు శంకుస్థాపన చేసి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి పలు అంశాలపై మత పెద్దలతో కూలంకషంగా చర్చించారు. వారి అభిప్రాయాలు సూచనలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది అని,  పరమతసహనం పాటిస్తుందని, అందుకే అన్ని మతాల ప్రార్థన మందిరాలు నిర్మిస్తున్నట్లు కెసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.