న్యూఢిల్లీ :: చైనా నుంచి తమ పరిశ్రమలను ఉపసంహరించుకున్న జపాన్, ఆయా సంస్థలకు అందించే రాయితీలు పొందేందుకు అర్హత సాధించిన జాబితాలో భారత్ ను బంగ్లాదేశ్ ను చేర్చుతామని ప్రకటించింది. చైనా దేశం పై ఆధారపడడం తగ్గించే దిశగా సెప్టెంబర్ 1 నుంచి సప్లై చైన్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ల మధ్య వర్చువల్ సమావేశం జరగనుంది. ప్రపంచ వాణిజ్యంలో చైనా అధిపత్యాన్ని ఢీ కొట్టేందుకు భారత్ ఆస్ట్రేలియా జపాన్ కలిసి పని చేయాలని నిర్ణయించాయి