న్యూ ఢిల్లీ :: వ్యాపారాలు చేసుకునేందుకు అనువైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. సులభతర వాణిజ్యం విభాగంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2019 ర్యాంకింగ్స్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శనివారం విడుదల చేశారు. ఈ జాబితాలో మరోసారి ఏపీ తన స్థానాన్ని పదిలం చేసుకోగా గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానంలో నిలిచింది. లాక్ డౌన్ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ ను అమలు చేయడంలోనూ అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఈ సందర్భంగా తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు నిర్మలాసీతారామన్ అభినందనలు తెలిపారు.