పబ్జి గేమ్ నిషేధం :: చైనాకు ఝలక్ ఇచ్చిన భారత్ ప్రభుత్వం

విభారె న్యూస్ :: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం  బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్‌లను నిషేధించిన ట్లు కేంద్రం ప్రకటించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్‌ ఉండటంతో ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్‌, యాపిల్‌ ప్లేసోర్ట నుంచి పబ్జీని తొలగించారు. పబ్జీతో పాటు బైడు, క్యామ్‌కార్డ్‌, విచాట్‌ రీడింగ్‌, టెన్సెంట్‌ వీన్‌, సైబర్‌ హంటర్‌, లైఫ్‌ ఆఫ్టర్‌ వంటి పలు యాప్‌లను కూడా ప్రభుత్వం నిషేధించింది.