ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్) :: ఈరోజు స్వామి వివేకానంద విశ్వ మానవ సేవ సమితి గ్రూప్ సభ్యులు ఆళ్లగడ్డ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో 90 మంది పారిశుద్ధ్య కార్మికులకు, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ద్వారా రైన్ కోట్స్ అందజేయడం జరిగింది. BNS ఆగ్రో అండ్ ఫ్రూ ట్స్ రఘు ఈ రైన్ కోట్స్ వితరణ చేశారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ సమయంలో, పారిశుద్ధ్య కార్మికులు వర్షంలో తడిచి అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి ఈ రైన్ కోట్స్ ఎంతో ఉపయోగపడతాయని కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఈ రైన్ కోట్స్ అందజేసిన రఘు గారికి, స్వామి వివేకానంద విశ్వ మానవ సేవ సమితి వారికి కమిషనర్ ధన్యవాదాాలు తెలియజేశారు.