ట్యాటూల పిచ్చికి పరాకాష్ట :: రెండు చెవులను కత్తిరించుకున్న ఘనుడు

బెర్లిన్ ::  ట్యాటూల పిచ్చి పరాకాష్టకు చేరింది. జర్మనీకి చెందిన శాంట్రోలా అనే కళాకారునికి ట్యాటూలు అంటే విపరీతమైన పిచ్చి. తన ఒంటి నిండా టాటూలు వేసుకుని చూడటానికి భయంకరంగా తయారయ్యాడు. ఇతను చూస్తేనే జనం భయపడుతున్నారు. అతను ట్యాటూల కోసం ఇప్పటి వరకూ17 శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. దాదాపు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. నోట్లో నాలుకను కూడా నిలువుగా రెండుగా చీల్చి టాటూలు వేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా తన రెండు చెవులను సర్జరీ ద్వారా తొలగించుకొని అవి పాడవకుండా రసాయనాల పూత పూసి జాడీలో భద్రపరచుకున్నాడు. చెవులు తొలగించుకున్న ప్రాంతంలో కూడా ట్యాటూలు వేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా వీటన్నిటినీ వీడియో గా తీసే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఫోటోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది అని విమర్శిస్తూ నెటిజన్లు కామెంట్ చేశారు. ఇలాంటి విమర్శలు తను మరిన్ని టాటూలు వేయించు కోవడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని సాండ్రోలా  చెప్పాడు.