యెమెన్‌కు చెందిన తలాల్ అబ్డో మహదీని హత్య చేసినందుకు యెమెన్‌లో నివసిస్తున్న 30 ఏళ్ల భారతీయ నర్సు అయిన నిమిషా ప్రియాకు స్థానిక కోర్టు గత వారం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా తనను వేధించి, హింసించాడని కేవలం తన పాసుపోర్టు వెనక్కి తీసుకోవడానికి మాత్రమే అతనికి మత్తుమందు ఇచ్చానని, చనిపోతాడని ఊహించలేదని నిమిషా ప్రియ తెలిపింది. తనకు సరైన న్యాయ సహాయం లేకపోవడం వలన ఈ పరిస్థితికి వచ్చిందని ఆమె తెలిపింది. జిబౌటిలోని భారత రాయబార కార్యాలయానికి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. మంగళవారం రాత్రి ఒక ట్వీట్‌లో వారు నిమిషా మరియు ఆమె న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతున్నారని, మరణశిక్షకు వ్యతిరేకంగా అప్పీల్ కోర్టులో అప్పీల్ చేయడానికి వారు అన్ని విధాలుగా న్యాయ సహాయం అందిస్తారని చెప్పారు. మృతుని కుటుంబానికి 70 లక్షల రూపాయలు చెల్లిస్తే, నిమిషా ప్రియకు క్షమాభిక్ష లభించే అవకాశం ఉంది.