ఆళ్లగడ్డ::(విభారె న్యూస్) :: పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి స్వాతి వేడుకలు సోమవారంనాడు దిగువ అహోబిలం నరసింహ స్వామి సన్నిధిలో జరిగాయి. .లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రంమైన స్వాతి వేడుకలకు ప్రధాన అర్చకులు వేణు గోపాలన్ ఆలయ మేనేజర్ వైకుంఠం స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి శ్రీదేవి భూదేవి అమ్మవారు లకు ప్రత్యేకంగా పూల అలంకరణ చేశారు. శాస్త్రోక్తంగా ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ అర్చక స్వాములు పాల్గొని వేద మంత్రోచ్ఛారణ తో స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు అనంతరం హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం మేనేజర్ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.