ఆళ్లగడ్డలో పరిమళించిన మానవత్వం

 ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్):: గుర్తుతెలియని అనాధ శవానికి   పట్టణ ఎస్ఐ రామి రెడ్డి, సామాజిక సేవకుడు ప్రిన్సిపల్ శ్రీనివాసులు  అన్నీ తామై అంతిమ వీడ్కోలు ఘనంగా పలికారు. ఆళ్లగడ్డ  పట్టణంలోని  బస్టాండ్ ఎదురుగానున్న టీ స్టాల్ దగ్గర గుర్తుతెలియని వృద్ధుడు   మృతి చెందాడు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ రామిరెడ్డి వెంటనే తన సిబ్బంది నాయుడు, హుస్సేన్,  సుధాకర్ లతో కలిసి వివరాలు సేకరించారు. వృద్ధుని అనాధగా గుర్తించిన ఎస్సై రామి రెడ్డి, బృందావన్ కాలేజీ అధినేత సామాజిక సేవకుడు ఈపనగండ్ల శ్రీనివాసులుతో కలిసి అనాధ వృద్ధుడికి  అన్ని తామై ఎస్సై రామిరెడ్డి  అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్ఐ బృందానికి పట్టణ ప్రజలు ప్రశంసలు అభినందనలు తెలిపారు.