బాలిక పూలు కోసిందని నలబై దళిత కుటుంబాల బహిష్కరణ.

ఒడిశా :: ధెంకనల్ జిల్లాలోని కాన్టియో కటేని గ్రామంలోని నలభై మంది దళిత కుటుంబాలు గత రెండు వారాలుగా సామాజిక బహిష్కరణకు గురయ్యాయి.దళిత కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలిక రెండు నెలల క్రితం అగ్రవర్ణాల వారి పెరట్లో పూలు కోసింది. ఈ సంఘటన రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. చివరికి 40 దళిత కుటుంబాల సామాజిక బహిష్కరణకు దారితీసిందని స్థానికులు చెప్పారు.బాలిక తండ్రి నిరంజన్ నాయక్ మాట్లాడుతూ, “ మేము వెంటనే క్షమాపణలు చెప్పాము, కాని సంఘటన తరువాత అనేక సార్లు మమ్మల్ని పిలిచారు. ఈ సమావేశంలో వారు మమ్మల్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. మాతో మాట్లాడటానికి ఎవరికీ అనుమతి లేదు. గ్రామం యొక్క ఏ సామాజిక కార్యక్రమంలోనైనా పాల్గొనడానికి మాకు అనుమతి లేదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.దాదాపు 800 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో షెడ్యూల్డ్ కుల నాయక్ వర్గానికి చెందిన 40 కుటుంబాలు ఉన్నాయి.