ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్) కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా హోమ్ క్వారంటైన్ లో ఉండే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హోమ్ క్వారంటైన్ లో ఉండే వారి బాధ వర్ణనాతీతం. వారి ఇళ్ల వద్దకు ఎవరూ వెళ్లరు. కరోనా బాధితులు ఇంటి నుంచి బయటకు వచ్చే వీలు లేదు. నిత్యావసర వస్తువులు, మందులు అవసరమైతే ఎవరు సహాయం చేయడం లేదు. ఏమాత్రం మానవత్వం లేకుండా కరోనా బాధితులను అంటరానివారిగా చూస్తున్నారు. కనీసం రక్తసంబంధీకులు కూడా బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. స్నేహితులు బాధితుల ఇంటివైపు తొంగి చూడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో హోం క్వారంటైన్ లో ఉన్న కరోనా బాధితులకు ఎలాంటి సేవలైనా అందించడానికి సిద్ధం అంటూ వల్లం కొండ సాయి అనే యువకుడు ముందుకు వచ్చాడు. చాగలమర్రి గ్రామానికి చెందిన ఈ యువకుడు కరోనా బాధితులకు ఉచితంగా సేవ చేస్తానంటూ, 9948340319 :: 8639004420 నెంబర్లకు ఫోన్ చేసి కరోనా బాధితులు తన సేవలు పొందవచ్చని వల్లంకొండ సాయి తెలిపారుతెలిపారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం అలవాటు చేసుకోవాలి. ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్థారణ పరీక్షలు చేసుకోవాలి. సిగ్గుపడకుండా భయపడకుండా సకాలంలో వైద్యసేవలు పొందితే వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని వల్లం కొండ సాయి సూచించారు. కరోనా బాధితులకు సేవలందిస్తా అంటూ ముందుకు వచ్చిన చాగలమర్రి వాసులు ప్రశంసిస్తున్నారు. సహాయం కోసం ఫోన్ చేయ వలసిన మొబైల్ నెంబర్లు 9948340319 :: 8639004420.