హైదరాబాద్:: కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ ఎడ్మ కిష్టారెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు . వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.శ్రీ ఎడ్మ కిష్టారెడ్డి గారు గ్రామ సర్పంచిగా, శాసన సభ్యులు గా ప్రజలకు ఎంతో సేవ చేశారని, కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. వారి సేవలు మరువలేనివని కొనియాడారు. మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో శ్రీ ఎడ్మ కిష్టారెడ్డి గారి అంత్యక్రియలకు ఏర్పాట్లు పర్యవేక్షించారు. వారి అంత్యక్రియలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన MLC లు, MLA లు మరియు MP లు పాల్గొన్నారు. అశేష జనవాహిని వెంటరాగా, అభిమానులు బంధువులు శోకతప్త హృదయాలతో ఆయనకు ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు.