ఆళ్లగడ్డలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని రోటరీ క్లబ్ భవనం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఆర్లగడ్డ పట్టణ న్యాయవాద సంఘ అధ్యక్షుడు పి సూర్యనారాయణ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ డాక్టర్ ప్రసాద్ గారి సతీమణి మరణానికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

 ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ సాగర్, కార్యదర్శి మల్లికార్జున, ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ శ్రీమతి విజయ కుమారి, మరియు కార్యదర్శి ఉషారాణి, సుజాత, శంకర రెడ్డి, సుబ్బారెడ్డి, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.