ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న సుబ్బయ్య అనే ఉద్యోగి కరోనా వ్యాధి కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. కరోనా సోకిన వెంటనే ప్రభుత్వ్వ కారం టైన్ కు వెళ్లి చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన ఒక రోజు తర్వాత తిరిగిి శ్వాస సంబంధమైన సమస్య తలెత్తింది. అత్యవసర వైద్య చికిత్స్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్ కు తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ఆయన మరణించారు. కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా సోకడంతో గత వారం రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మూసివేశారు. సుబ్బయ్య మరణంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగులు, రైటర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఒక సమర్ధుడైన, ఆత్మీయుడైన ఉద్యోగిని కోల్పోయామని, సుబ్బయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనః శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆళ్లగడ్డ సబ్ రిజిస్టార్ నరేంద్ర నాథ్ రాజు తెలిపారు.