సోహ్నా( రాజస్థాన్) :: పెళ్లి చూపులలో చెలరేగిన చిన్నపాటి ఘర్షణ ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. బాధితుడు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న వ్యక్తి ఇంటికి తన భార్య ఇద్దరు కుమారులతో కలిసి వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత తన కుమార్తెను ఆ ఇంటి కోడలిగా పంపడానికి నిరాకరించాడు. దాంతో అక్కడ జరిగిన ఘర్షణలో వరుని గా భావిస్తున్న వ్యక్తి వధువు తండ్రిని కత్తితో పొడిచేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా దారిలో మరణించాడు. ఆరుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.