కేరళలో విమాన ప్రమాదం :: ముగ్గురు మృతి,35 మందికి తీవ్ర గాయాలు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్‌ నుంచి కోజికోడ్‌కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన డీఎక్స్‌బీ-సీసీజే బోయింగ్ 737 ఐఎక్స్‌ 1344 విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షాల కారణంగా రన్ వే పైకి నీరు చేరడంతో విమానం రన్‌వే పై నుంచి జారి రెండు ముక్కలైంది. ఈ దుర్ఘటనలో పైలట్‌తో సహా మరో ఇద్దరు మృతి చెందారు. మరో పైలట్ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.  35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు.  ఈ విమాన ప్రమాదంపై డీసీజీఏ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.