ఇప్పటికీ కోలుకోని వూహాన్ కరోనా రోగులు: కోలుకున్న 90 శాతం మందిలో దెబ్బతిన్న ఊపిరితిత్తులు.

వూహాన్ :: మొదటి దశ ఫలితాల ప్రకారం, భూటాన్ లో కరోనా రోగ బాధితులరోగుల ఊపిరితిత్తులలో90 శాతం మందికి ఇప్పటికీ దెబ్బతిన్న స్థితిలోనే  ఉన్నాయి. వారిలో ఊపిరితిత్తులు శ్వాస సంబంధమైన ప్రక్రియను సరిగ్గా నిర్వహించలేక ఉన్నాయని ఒక నివేదికలో వెల్లడించారు.కరోనా మహమ్మారి జన్మ స్థానం గా చెప్పబడిన చైనాలోని వుహాన్ నగరంలోని ఒక ప్రముఖ ఆసుపత్రి లో  కరోనా వైరస్ నుండి 
కోలుకున్న రోగులలో  తొంభై శాతం మంది ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు నివేదించారు. మరియు వారిలో ఐదు శాతం మందికి నిర్ధారణ పరీక్షలలో మళ్లీ పాజిటివ్ రావడంతో రెండవ సారి నిర్బంధంలో ఉన్నారని మీడియా   నివేదిక తెలిపింది.ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ డైరెక్టర్ పెంగ్ జియాంగ్ నేతృత్వంలోని వుహాన్ విశ్వవిద్యాలయం యొక్క
 హాస్పిటల్‌లో ఒక బృందం ఏప్రిల్ నుండి కోలుకున్న 100 మంది రోగులకు తదుపరి పరీక్షలు నిర్వహిస్తోంది.