వ్యాక్సిన్ 2021 ప్రారంభంలోనే :: డబ్ల్యు హెచ్ ఓ

జెనీవా :: క్లినికల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయని,  వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు ప్రకటించారు. కొరోనావైరస్ వ్యాక్సిన్ కేవలం కొన్ని నెలల దూరంలో ఉందని, 2021 వ సంవత్సరము ప్రారంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనావైరస్ నుండి మానవాళిని రక్షించే కరోనా వ్యాక్సిన్ ఇంకా ప్రయోగ దశలోనే ఉందని  డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సూచించారు. “అనేక టీకాలు ఇప్పుడు   క్లినికల్  ట్రయల్స్ మూడవ దశ లో ఉన్నాయి. మరియు ప్రజలను వ్యాధి సంక్రమణ నుండి రక్షించే  అనేక ప్రభావవంతమైన వ్యాక్సిన్లను త్వరలోనే కనుగొనాలని మేము అందరం ఆశిస్తున్నాము. అయితే ప్రస్తుతానికి మాత్రం అది అందుబాటులో లేదు ”అని టెడ్రోస్ అన్నాడు. వచ్చే సంవత్సరం వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తాను ఆశిస్తున్నట్లు అమెరికా  అంటువ్యాధుల నిపుణుడు మరియు  ఆంథోనీ ఫౌసీ చెప్పాడు.