ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్): ఆళ్లగడ్డ పట్టణంలో వీధి లైట్లు వెలగ కుంటే ఎవరిని సంప్రదించాలి? ఇది ఆర్లగడ్డ పట్టణంలోని ప్రతి పౌరున్ని వేధిస్తున్నన సమస్య. సమాధానం తెలియని ప్రశ్న. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీధి లైట్లు వెలగకుంటే సంబంధిత వాలంటీర్ ద్వారా గ్రామ సచివాలయానికి ఫిర్యాదు చేయాలి. సదరు గ్రామ సచివాలయ అడ్మిన్ ఆదేశాల మేరకు జూనియర్ లైన్ మెన్ ఫిర్యాదు అందిన ప్రాంతాన్ని పరిశీలించి వీధిి లైట్లు పునరుద్ధరించి ఈ సమస్యను పరిష్కరించాలి. కానీ పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల సమస్య పరిష్కారం కాకుండా వీధి లైట్లు వెలగని ప్రాంతంలోని ప్రజలు చీకటిలోనే గడపవలసి వస్తోంది. మునిసిపాలిటీ, విద్యుత్ శాఖ, గ్రామ సచివాలయ అధికారులు మధ్య సమన్వయము లోపించడం వలన సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటోంది. ప్రజలకు సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా తక్షణ సేవలు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన ఉద్దేశాలు నెరవేరకుండా పోయే ప్రమాదం ఉంది. కావున సంబంధిత అధికారులు ఒకరిపై మరొకరు నెపం వేసి తప్పించుకోవడం మానుకొని వెంటనే తగిన చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించ వలసినదిగా ఆళ్లగడ్డ పట్టణ ప్రజలు కోరుతున్నారు.