తొమ్మిది వేల ఐదు వందల మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో 9500 మంది పోలీసులకు కరోనా!

ముంబయి: మహారాష్ట్రలో  కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. మహారాష్ట్రలో భారతదేశంలో కెల్లా అత్యధిక కరోనా కేసులు, మరణాలు  చోటుచేసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మొదటి వరుసలో విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులూ ఎక్కువ సంఖ్యలోఈ మహమ్మారి బారినపడుతున్నారు.రాష్ట్రంలో ఇప్పటివరకు  9566 పోలీసులు ఈ   వైరస్‌ బారినపడినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 103 మంది మరణించినట్లు తెలిపారు. వైరస్‌ బారినపడిన మొత్తం పోలీసు సిబ్బందిలో 7,534 మంది ఇప్పటిి వరకూ ఇప్పటి వరకూ కోలుకోగా మరో 1929 మంది పోలీసులు చికిత్స పొందుతున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని ముంబయితో పాటు పుణె తదితర నగరాల్లో వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే ఏకంగా 9600 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,000 దాటింది. వీరిలో ఇప్పటివరకు 15,316 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 322 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2లక్షల 60వేల మంది కోలుకున్నారు. మరో లక్షా 50వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 17లక్షలు దాటింది. వీరిలో 37,364 మంది మృత్యువాత పడ్డారు.