ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్): మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఆళ్లగడ్డ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందాలంటే కేవలం అధికార వికేంద్రీకరణ వల్లనే సాధ్యం అవుతుందని, అది మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యరూపంలోకి తీసుకువచ్చారని, అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలంటే కేవలం మూడు రాజధానుల వల్లనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.కర్నూల్ జుడిషియల్ క్యాపిటల్ గా ఏర్పాటు చేయడం వలన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా దివంంగత ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రిి దివంగత ముఖ్యమంత్రి వైైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్లగడ్డ న్యాయవాద సంఘ అధ్యక్షులు పి.సూర్యనారాయణ రెడ్డి, జి.అశ్వర్థ రెడ్డి,
బి. నీలకంటేశ్వర, బివి సుబ్బారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, షడ్రక్, మహిళా న్యాయవాది రమాదేవి మొదలగువారు పాల్గొన్నారు.