హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు హైదరాబాద్ జీహెచ్ఎంసీ మళ్లీ జరిమానా విధించింది. ఆయన తాజా గా దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘పవర్‌స్టార్’ సినిమాకు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించినందుకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంటల్ సెల్ రూ.88వేలు జరిమానా చెల్లించాలంటూ బుధవారం ఈ-చలానా జారీ చేసింది. లాక్‌డౌన్ తర్వాత మొట్ట మొదటి పోస్టర్ అంటూ ఆర్జీవీ ఇటీవల ట్విట్టర్‌లో పెట్టిన పోస్టును గమనించిన ఓ నెటిజన్ సీఈసీ-ఈవీడీఎం కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఈనెల 22న జూబ్లీహిల్స్‌లో ప్రదర్శించిన రెండు పోస్టర్లకు గానూ రూ.4 వేలు జరిమానా విధించారు. అయితే ఈ ప్రాంతంలోనే దాదాపు 30కి పైగా పోస్టర్లు ప్రదర్శించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతులు తీసుకో నందున రూ.88వేల జరిమానా విధిస్తున్నట్లు చలానా లో తెలిపారు.