మహిళల సాధికారతకు రెండు నూతన పథకాలు :: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

అమరావతి:మహిళల సాధికారతకు ఆగస్టు, సెప్టెంబరులో రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.  అత్యంత క్లిష్టమైన సమయంలో బ్యాంకర్లు రాష్ట్రానికి సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. వైఎస్ఆర్‌ చేయూత ద్వారా 25 లక్షల మంది మహిళకు సాయం అందిస్తామని ఆయన చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలిపారు. సెప్టెంబరులో స్వయం సహాయ సంఘాలకు రూ.6,700 కోట్లకుపైగా సహాయం చేయనున్నట్లు వివరించారు. మహిళలకు ఆదాయం చేకూర్చే విధంగా కార్యక్రమాలను కంపెనీలు, బ్యాంకర్లు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో  ఆర్థిక వ్యవస్థ మెరుగు పడేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని సీఎం జగన్‌ చెప్పారు.