కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు, ఆహారం అందిస్తున్నాము

కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు, ఆహారం అందిస్తున్నాము::

 మంత్రి ఆళ్ల నాని

రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరంలో బుధవారం కొవిడ్‌పై సమీక్ష జరిగింది కరోనా రోగులకు సరైన సమయానికి ఆహారం, ఔషధాలు అందిస్తున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి కొవిడ్‌ రోగికి భోజనం కోసం రోజుకి రూ.500 చొప్పున ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కరోనా బాధితులకు వైద్యం  అందిస్తున్నట్టు తెలిపారు. నిర్దేశించిన మెనూ అమలు చేయకపోయినా, సరైనసమయానికి ప్రభుత్వం నిర్దేశించిన ఆహారం అందించకపోయినా చర్యలు  తప్పవని సీఎం స్పష్టం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  కరోనా రోగులకు వైద్యం తిరస్కరించే ప్రైవేటు ఆసుపత్రులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని  మరో మారు స్పష్టం చేశారు.  భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా వెచ్చిస్తున్న నిధులు కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా మృతులకు సంబంధించిన లెక్కలు దాచ వలసిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా రోగులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తమ ప్రభుత్వం  కరోనా నివారణ చర్యలు పారదర్శకంగా చేపట్టిందని మంత్రి వివరించారు.