పహాడీషరీఫ్ :: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది భర్తలను వదిలేసింది. తొమ్మిదో భర్త చేతిలో మరణించింది.ఇతర వ్యక్తులతో సన్నిహితంగా మెలుగుతున్న ఓ భార్యను ఆమె భర్త అనేకసార్లు వారించాడు. అయినా ఆమె లో ఏ మాత్రం మార్పు రాకపోయేసరికి ఆవేశంలో గొంతు కోసి హతమార్చాడు. విచారణ జరుపుతున్న పోలీసులు మృతురాలికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అవాక్కయి పోయారు. మృతురాలికి అంతకుముందే 8 పెళ్లిళ్లు జరిగాయని, తొమ్మిదో భర్త చేతిలో హతమైందని స్థానికులు తెలిపారు. పహాడీషరీఫ్ ఠాణా ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాలు.. ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపల్ పరిధి శ్రీరామకాలనీలో నివాసం ఉంటున్నాడు. క్యాబ్‌డ్రైవర్ నాగరాజుకు వరలక్ష్మి కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న వరలక్ష్మికి క్యాబ్ డ్రైవర్ నాగరాజు కు పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. నాగరాజు, వరలక్ష్మి మధ్య పరిచయం ప్రేమగా మారింది. వరలక్ష్మి రెండేళ్ల క్రితం తన ఎనిమిదవ భర్తను వదిలేసి నాగరాజును పెళ్లి చేసుకుంది. కొద్దిరోజుల ఆ తర్వాత వరలక్ష్మి కొత్త వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకోవడం గమనించిన నాగరాజు ఎంత మందలించినా వినకపోవడంతో ఆవేశంలో కత్తి తీసుకొని గొంతుకోసి హతమార్చాడు. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.