ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నారు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయకండి.

మంత్రి ఆళ్ల నాని

అమరావతి: కోవిడ్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న కూడా కరోనా కేంద్రాల్లో భోజన వసతి మరియు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నామని, వారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. అలాంటి ఆరోపణలు వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతేసే విధంగా ఉన్నాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా చికిత్సల కోసం దాదాపు రూ. 350 కోట్లు ఖర్చవుతోందన్నారు. కోలుకున్న వారి నుంచి వారి అనుమతితో ప్లాస్మా సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలను దయచేసి ఎవరు అభ్యంతరాలు చెప్పవద్దని, మానవత్వంతో వ్యవహరించమని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్ చికిత్సకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, గత 6 నెలలుగా 17వేల మంది నిపుణులను నియమించామని మంత్రి  వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 20 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ కింద అర్హులైన వారికి  కరోనా చికిత్సకు నిరాకరించినా, వారి నుండి అధిక ధరలు వసూలు చేసినా క్షమించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.