ఇంటికే పెళ్లి భోజనాలు :: ఆలోచన అదుర్స్

 విశాఖపట్టణం :: ప్రపంచవ్యాప్తంగా కరోనా చేస్తున్న చిత్రవిచిత్రాలు అన్ని ఇన్ని కాదు. కరోనా కు అనుగుణంగా తమ పద్ధతులు, సాంప్రదాయాలు మార్చుకోవలసి వస్తోంది. ఎంత గొప్ప వారైనా కేవలం 

20 మందితోనే పెళ్ళి తంతు ముగించాల్సిన పరిస్థితి. దానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి చేశారు. దీంతో ఎంత గొప్పవారైనా తమ ఇళ్లల్లో శుభకార్యాలు సాదాసీదాగా ముగించాల్సి వస్తోంది. దీంతో తమ పెళ్ళిళ్ళలో బంధువులు మిత్రులు లేని లోటు భర్తీ చేసేందుకు విశాఖకు చెందిన ఒక యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూనే విందు భోజనం సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు నిర్ణయించుకున్నాడు పెళ్లికి అందరినీ పిలిచి భోజనాలు వండి  వడ్డించ లేకపోయినా, భోజనాలు తయారు చేసి నేరుగా బంధువులు ఇంటికే ఉదయం టిఫిన్,  మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం నేరుగా బంధుమిత్రుల ఇళ్లకు చేరేలా ఏర్పాటు చేశారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారో తెలుసుకొని  టిఫిన్,  భోజనాలు, ప్లేట్లు, స్పూన్, వాటర్ బాటిల్ తో సహావారి ఇంటికే పంపించాడు. బంధుమిత్రులు  తమ ఇంట్లోనే  పెళ్లి విందు పెళ్లి విందు ఆరగించి ఫోన్లో వధూవరులను ఆశీర్వదించారు. ఇకముందుు మరికొంతమందిఇక ముందు మరికొంతమంది ఈ పద్ధతి అనుసరించాలని ఆలోచిస్తున్నారు. ఆలోచన అదుర్స్ కదా!