కర్నూలు స్టేట్ కోవిద్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరఫీ విజయవంతం

కర్నూలు :: కరోనాతో బాధపడుతూ పరిస్థితి విషమంగా ఉన్న రోగులు కూడా ప్లాస్మా థెరఫీతో కోలుకుంటున్నారని కర్నూలు  స్టేట్ కోవిడ్ వైద్య అధికారులు తెలిపారు. ప్లాస్మా థెరఫీ ని స్వీకరించిన కరోనా బాధితులు త్వరితగతిన కోలుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ కర్నూలు  స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకూ ఐదుగురు కరోనా బాధితులకు ప్లాస్మా తెరఫీ అందించినట్లు, అందులో నలుగురు కోలుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం చేయడం వలన ఎలాంటి అనారోగ్యం రాదని అది కేవలం అపోహ మాత్రమేనని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.