అమరావతి :: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు నాణ్యమైన చికిత్స అందించేందుకు మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మొత్తం 138 ఆసుపత్రులలో క్రిటికల్ కేర్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద మరో ఐదు ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, వాటిలో ఇప్పటికే మూడు ఆసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. రానున్న ఆరునెలల్లో ఇందుకుగాను అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మందులు ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కోవిడ్ టెస్టులు క్వారంటైన్ సదుపాయాల కోసం రోజుకు 6.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు కోవేట్ బాధితులు చికిత్సకోసం 2380 క్రిటికల్ కేర్ బెడ్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు