కోవిడ్ కేంద్రంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం

 ఢిల్లీ :: జూలై 15 రాత్రి, కోవిడ్ కేంద్రంలోని బాత్రూంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒక మైనర్ బాలిక ఆరోపించింది. 19 ఏళ్ల వయసు కలిగిన ఒక కరోనా పాజిటివ్ రోగి బాత్రూంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడగా, ఇంకొక రోగి తన  ఫోన్లో చిత్రీకరించాడని ఆ బాలిక ఆరోపించింది.

అదనపు డిసిపి (దక్షిణ జిల్లా) పర్వీందర్ సింగ్ మాట్లాడుతూ “ఇద్దరు వ్యక్తులపై పోక్సో చట్టం, ఐపిసి 376 (లైంగిక వేధింపుల) కింద కేసు నమోదు చేశాం. నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినా వారు ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకునే వరకు సంస్థాగత సంరక్షణలో ఉంటారు. మేము ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాము. ” అన్నారు

ఈ నెల మొదట్లో బాలికను కుటుంబ సభ్యుడితో కలిసి కేంద్రంలో చేర్పించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితులను కూడా అదే రోజు కేంద్రంలో చేర్చారు. ఈ సంఘటన తరువాత, బాలిక తన కుటుంబ సభ్యునికి తెలిపింది.వారు ఈ సంఘటన గురించి పోలీసులకు  సమాచారం ఇచ్చారు.నిందితులు ఇద్దరిని ఎయిమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షలు జరిపిన తర్వాత ఇద్దరిని జైలుకు పంపిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.