బీహార్: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినందుకుబక్సార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బ్రహ్మూర్ ఎమ్మెల్యే శంభు నాథ్ యాదవ్ పై కేసు నమోదైంది. టోర్నమెంట్ ప్రారంభంలో బంతిని కొట్టడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే కాలు జారి కింద పడిపోవడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి, అందులో పాల్గొన్నందుకు అతనిపై కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి సామాజిక దూరం పాటించవలసి ఉండగా ఆ నిబంధనలేవీ ఆ టోర్నమెంట్ లో పాటించలేదని తెలిసింది. నిబంధనలు ఉల్లంఘించి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు