మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం

వెల్లూరు :: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నలిని శ్రీహరన్ సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె న్యాయవాది తెలిపారు. వెల్లూరు జైలులో నలిని ఆత్మహత్యాయత్నం చేసింది.

నలిని గత 29 సంవత్సరాలుగా  వెల్లూరు మహిళల జైలులో ఉన్నారు. పుగలేంతి మాట్లాడుతూ గత 29 ఏళ్లలో నలిని శ్రీహరన్  ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి.

ఈ సంఘటన గురించి వివరిస్తూ,  నలిని మరియు అదే జైలులో  ఉన్నమరో జీవిత ఖైదీ మధ్య గొడవ జరిగిందని తెలిపారు. నళిని తన సహ ఖైదీని  తనకు సేవలు చేయమని బెదిరించడంతో ఆమె  జైలు అధికారులకు ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ జరిపిన జైలు అధికారులు నళినీ ని  మందలించి నట్లు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన నలిని ఆత్మహత్యాయత్నం చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని మే 21, 1991 న ఎల్‌టిటిఇ ఆత్మాహుతి దాడిచేసిన కేసులో నలిని, ఆమె భర్తతో సహా ఏడుగురిని ప్రత్యేక టాడా కోర్టు దోషులుగా నిర్ధారించింది.

మొదటవారికి మరణశిక్ష విధించబడింది, కాని తరువాత దానిని జీవిత ఖైదుగా మార్చారు.నలినితో పాటు,  ఆమె భర్త మురుగన్, ఎజి పెరరివలన్, సంతన్, జయకుమార్, రవిచంద్రన్ మరియు రాబర్ట్ ప్యస్ యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్నారు