బ్రెజిల్ అభ్యర్థన మేరకు భారతదేశంలో 60 బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్

న్యూ ఢిల్లీ :: భారతదేశంలోని  కొంతమంది వ్యక్తులు మరియు వ్యాపారవేత్తల కు చెందిన 

60 కి పైగా బ్యాంకు ఖాతాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారు స్తంభింప చేశారు.బ్రెజిల్ లోని మనీలాండరింగ్ కేసుకు సంబంధించి,  బ్రెజిల్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు దేశంలో 60 కి పైగా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసే ప్రక్రియను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రారంభించినట్లు తెలిసింది.

ఆర్థిక నేరాలను ఎదుర్కోవటానికి ఇరు దేశాల మధ్య పరస్పర ఒప్పందాన్ని అనుసరించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధన ప్రకారం ఏజెన్సీ ఈ చర్య చేపట్టిందని వారు తెలిపారు.ఈ పరిశోధన బ్రెజిల్‌లోని కొంతమంది ఉన్నత వ్యక్తులతో ముడిపడి ఉందని వారు చెప్పారు.