ఈ నెల 22న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ

అమరావతి: ఆంధ్ర్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈనెల 22వ తేదీన జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంత్రివర్గ్గ విస్తరణ ఎప్పుడనే అంశంపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది.  ఈ చర్చలకు తెర దించుతూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నెల 22న మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని వెల్లడించింది. ఆ రోజున కేవలం ఇద్దరు కొత్త మంత్రులు మాత్రం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ఇటీవల మంత్రి పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ల  సామాజిక వర్గానికి చెందిన వారినే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రామచంద్రాపురం, పలాస శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కే అవకాశముంది.