ముంబై :: ముంబైలోనే జైన్ దేవాలయం బయట బిచ్చమెత్తు కుని జీవించే సంజనా బాయ్ అనే ఓ వృద్ధురాలు తన కోడలు చేతిలో దారుణ హత్యకు గురైంది. బిచ్చమెత్తుకుని సంపాదించిన సొమ్ము కోసం కోడలు తరచూ ఆ వృద్ధురాలిని వేధించేది. అత్తా కోడళ్ళు తరచూ ఘర్షణ పడేవారు. ఆ వృద్ధురాలికి ముంబై నగరంలో ఖరీదైన నాలుగు భవంతులు ఉన్నాయి. వాటి పైన వచ్చే బాడుగ కోసం కూడా తరచూ ఘర్షణ జరిగేది. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న సంజనా బాయ్ ని కోడలు స్థానిక ఆసుపత్రిలో చేర్చింది. వృద్ధురాలి శరీరంపై అనేక గాయాలు ఉండటంతో అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధురాలు చికిత్స పొందుతూ మరణించింది. విచారణలో తానే ఆ వృద్ధురాలిని క్రికెట్ బ్యాట్ తో కొట్టినట్టు ఒప్పుకుంది. ఆ వృద్ధురాలికి సంతానం లేదు. వృద్ధురాలి దత్తపుత్రుని భార్య ఈ దారుణానికి ఒడిగట్టింది. పోలీసులు కేసు నమోదు చసి దర్యాప్తు చేస్తున్నారు.