కడలూరు: తమిళనాడులోని ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగి ఏకంగా ఎస్.బి.ఐ. డూప్లికేట్ బ్యాంక్ ప్రారంభించాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డూప్లికేట్ బ్రాంచ్‌ను నడుపుతున్నందుకు తమిళనాడులోని కడలూరు జిల్లాలోని పన్రుతి పోలీసులు మాజీ బ్యాంక్ ఉద్యోగి కుమారుడితో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎస్ కమల్ బాబు (19), ఎ కుమార్ (42), ఎం మణికం (52) అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కొన్నేళ్ల క్రితం బ్యాంక్ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన కమల్ బాబు, పన్రుతిలోని ఒక గది బాడుగకు తీసుకుని అక్కడి నుండి స్టేట్ బ్యాంక్ నకిలీ శాఖను నడుపుతున్నాడు. కడలూరు పోలీసు సూపరింటెండెంట్ ప్రకారం, ఈ డూప్లికేట్ బ్రాంచ్ మూడు నెలలుగా నడుస్తున్నది. ఇంతవరకూ ఏ వినియోగదారుడు మోస పోలేదు. బ్రాంచ్‌లో ఎవరూ డబ్బు జమ చేయలేదు. కమల్ బాబు అటెండెన్స్ రిజిస్టర్లను నిర్వహించడం, సంతకాలు పెట్టడం మరియు ఆఫీసు డ్యూటీని స్వయంగా నిర్వహించేవాడుస్థానిక స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ యొక్క మేనేజర్ వద్ద కమల్ బాబు బంధువు ఈ నకిలీ బ్రాంచ్ పై అనుమానం వ్యక్తం చేయడంతో, ఆయన పోలీసుల దృష్టికి తెచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పన్రుతి నార్త్‌లో ఎస్బిఐకి బ్రాంచ్ లేనందున యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ దీని గురించి ఎస్బిఐ అధికారులను తెలియజేశారు. దీంతో ఈ డూప్లికేట్ స్టేట్ బ్యాంక్ యొక్క బాగోతం బయటపడింది.