‘దిశా’ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో నెలాఖరులోగా నివేదికను సమర్పించాలి :: సుప్రీంకోర్టు

హైదరాబాద్:: పశు వైద్యురాలి పై అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ దర్యాప్తు పూర్తి చేసింది. ఫిబ్రవరిలో నియమించిన ఈ కమిటీలో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పూకర్ , ముంబై హైకోర్టు జస్టిస్ ఆర్.పి. సోండుర్‌బల్డోటా, సిబిఐ మాజీ చీఫ్ బి.కార్తీకేయన్ ఉన్నారు.ఇచ్చిన ఆరు నెలల గడువు పూర్తి కానున్నందున  ఈ నెలాఖరులోగా సమర్పించాలని కమిషన్ భావిస్తోంది. నేరం జరిగిన రెండు రోజుల తరువాత నిందితులు-మొహమ్మద్ ఆఫ్రోజ్, జె నవీన్, జె.శివ మరియు చెన్నకేశవులు నవంబర్ 29 న అరెస్టు చేయబడ్డారు.
సంఘటనలను పునర్నిర్మించడానికి 
డిసెంబర్ 6 తెల్లవారుజామున, హైదరాబాద్ శివార్లలోని నేరస్థలానికి తీసుకువెళ్లారు.అక్కడ నిందితులు నలుగురు,  పోలీసులపై  దాడి చేసి తప్పించుకునే ప్రయత్నంలో కాల్చి చంపబడ్డారని పేర్కొన్నారు.