బంగారపేట్::( కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేట తాలూకాకు చెందిన తహసీల్దార్ ను గురువారం సాయంత్రం ఒక రిటైర్డ్ హెడ్మాస్టర్ పొడిచి చంపిన ట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తహసిల్దార్ చంద్రమౌళీశ్వర కోలార్ జిల్లా లోని బంగారు పేట తాలూకాలోని గ్రామానికి వెళ్లి ఒక భూమిని సర్వే చేస్తుండగా రిటైర్డ్ హెడ్మాస్టర్ వెంకట చలపతి వారితో ఘర్షణకు దిగాడు. సర్వేయర్ రామమూర్తి వెంకటా చలపతి తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. తహసీల్దార్ చంద్రమౌళీశ్వర వారికి సర్ది చెప్పబోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటా చలపతి తహసిల్దార్ ను కత్తితో పొడిచాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో తహసిల్దార్ మరణించాడు. కామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ఈ సంఘటనను ఖండించారు. మృతుని కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా, మరియు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు.