అతిగా టీవీ చూస్తే రోగనిరోధక శక్తి తగ్గుతుంది :: ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా :: ప్రపంచ దేశాలన్నీ కరుడుగట్టిన కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతున్నాయి. ముఖానికి మాస్క్ వేసుకోవడం, తరచుగా చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడంతో కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. ఒకవేళ కరోనా వైరస్ బారిన పడితే ఈ క్రింద తెలిపిన ముందు జాగ్రత్తలు పాటిస్తే రోగాన్ని సులభంగా జయించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉండడంతో ముఖానికి మాస్క్ వేసుకోవడం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు, కోడిగుడ్లు, మరియు ఎక్కువగా ప్రొటీన్లు ఉన్న ఆహారం తినడం వలన మీ రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. మద్యపానాన్ని తగ్గించుకోండి. చక్కెర పానీయాలను సేవించ వద్దు. ధూమపానం చేయవద్దు. మీరు కోవిడ్ -19 బారిన పడితే ధూమపానం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. పెద్దలు రోజుకు 30 నిమిషాల వ్యాయామము మరియు పిల్లలు రోజుకు ఒక గంట వ్యాయామము చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోకుండా చూసుకోండి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలు లేచి అటు ఇటు తిరగండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సంక్షోభ సమయంలో ఒత్తిడికి గురికావడం మరియు భయపడటం చేయవద్దు. ఈ కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఎక్కువగా వార్తలు చదవడం, అతిగా టీవీ చూడడం మానసిక ఉద్రేకానికి దారితీస్తుంది. టీవీలో వార్తలు ఎక్కువగా చూడకుండా ఉండటానికి ప్రయత్నించండి. ప్రస్తుత పరిస్థితులలో ఆ వార్తలు మిమ్మలను ఆందోళనకు గురి చేయవచ్చు.ఆందోళన మీ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కనుక పై సూచనలు పాటిస్తే మీరు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారు. ఎలాంటి మహమ్మారి నైనా ఎదుర్కొంటారు. అని డబ్ల్యూ.హెచ్.ఓ తాజాగా ఒక ప్రకటన లో తెలిపింది.